అక్రమ వసూళ్ల పై.. చర్యలు తీసుకొవాలి

17-10-2026 | 09:45pm

కోహెడ, అక్టోబర్ 17 (విజయక్రాంతి): బతుకమ్మ పండుగ(Bathukamma Festival) నేపథ్యంలో వివిధ గ్రామాల రైతులు(Farmers) కోహెడ అంబేద్కర్ చౌరస్తా వద్ద పూలు విక్రయిస్తున్న రైతులు, చిరు వ్యాపారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూళ్ చేసిన వ్యక్తి పై పోలీస్, అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం(BJP District General Secretary Khammam Venkatesam) కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం గ్రామం లో కొనసాగే వారసంతా కు జీపీ ఆధ్వర్యంలో వేలం దక్కించుకున్న ఓ వ్యక్తి శనివారం కూడ జీపీ రశీదు ఇవ్వకుండా అక్రమంగా డబ్బులు వసూల్ చేయడం పట్ల అగ్రహారం వ్యక్తం చేశారు.

అక్రమ వసూల్ పై పలువురు రైతులు, చిరు వ్యాపారాలు నిలదీసినప్పటికి దుర్భషాలాడుతూ.. తన పని తాను చేసుకున్నారని ఆవేదన చెందారు. అక్రమ వసూల్ పై సంబందిత పంచాయతీ కార్యదర్శి పోలీస్లకు, మండల, జిల్లా అధికారులకు పిర్యాదు చేసి చట్టా పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో రైతు, వ్యాపారుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు