కరెన్సీ నోట్లతో కాళరాత్రిదేవి అవతారం

18-10-2026 | 12:06am

- ఆమ్మవారిని దర్శించుకున్న కరీంనగర్ సెషన్స్ జడ్జి

- ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, అక్టోబరు 17 (విజయక్రాంతి): నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన శనివారం  శ్రీ మహాశక్తి ఆలయంలో శ్రీ మహాలక్ష్మీ దేవి(Goddess Sri Mahalakshmi) (కాళరాత్రి) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కరెన్సీతో నిజ పాద దర్శన రూపంలో ప్రత్యేకంగా అలంకరించిన శ్రీ మహాలక్ష్మీ దేవిని భక్తులు(devotees) దర్శించుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) ఉదయం నుండి సాయంత్రం వరకు పూజలు నిర్వహించడంతోపాలు అమ్మవారి సేవలో తరించారు.

ఆలయానికి వచ్చిన భక్తులను కలుసుకుంటూ వారితో ముచ్చటించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ లక్ష్మీ సాహస్ర పారాయణం విన్పించారు. అనంతరం బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వర శర్మ పండితులు‘‘శ్రీ భాగవత వైభవం’’ వివరిస్తూ ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా సెషన్స్ జడ్జి ఎస్ శివకుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాండియా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు