అక్కంపల్లిలో వీధి కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు
నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 27 (విజయ క్రాంతి):మండలంలోని అక్కంపల్లి గ్రామంలో(Akkampalli Village) మంగళవారం వీధి కుక్కలు చిన్న బాలుడుపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.నాగిరెడ్డిపేట్ మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన నీల స్వాతిక్ ఇంటి ముందు ఆడుతుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేసి తలపై తీవ్రంగా గాయపరిచాయి.
బాలుడి తల చర్మం చీలిపోయి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.గ్రామంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉండడంతో చిన్నపిల్లలు, పెద్దలు బయటకు రావాలంటే భయపడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధించిన గ్రామపంచాయతీ సిబ్బంది, అధికారులు ఈ విషయంపై స్పందించి చర్యలు తీసుకొని గ్రామంలో వీధి కుక్కల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు.