పోట్పల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

27-10-2026 | 10:56pm

*సర్పంచ్, రేషన్ డీలర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కార్డుల అందజేత

సిర్గాపూర్ అక్టోబర్ 27 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని పోట్పల్లి గ్రామంలో మంగళవారం నాడు గ్రామ సర్పంచ్ తుకమ్మ, డీలర్ అర్జున్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల(Smart Ration Cards) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుకమ్మ మాట్లాడుతూ... ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని తెలిపారు.

స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరిగి, లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుతాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రావ్ పాటిల్, సచిన్ రావ్ పాటిల్, సుమంత్, అబ్రహం, ముకుంద నాయక్, గ్రామ ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు