శ్రీ సిటి ప్లాంట్ లో ఇసుజు మోటార్స్ ఇండియా దశాబ్ద వేడుకలు
చెన్నై: ఇసుజు మోటార్స్ లిమిటెడ్, జపాన్ వారి అనుబంధ సంస్థ అయిన ఇసుజు మోటార్స్ ఇండియా(Isuzu Motors India) శ్రీ సిటి, ఆంధ్ర ప్రదేశ్ వద్ద ఉన్నటువంటి తన ఆధునిక ఉత్పాదక సదుపాయములో వాహనాల తయారీ రంగములో పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేడుకలను జరుపుకుంది.
ఏప్రిల్ 2016 లో ప్రారంభించబడిన ఈ సదుపాయము ఇసుజు యొక్క దేశీయ మరియు విదేశీ మార్కెట్ల కొరకు కీలకమైన ఉత్పాదక స్థావరముగా అభివృద్ధి చెందింది. ఈ ప్రయాణము భారతదేశములో తయారీ రంగములో ఇసుజు యొక్క నిబద్ధతను మరియు భారతదేశము మరియు మధ్య ప్రాచ్య దేశాలు (సౌదీ అరేబియా, బెహ్రెయిన్, కతార్, కువైట్, ఒమన్ మరియు జోర్డాన్) మరియు ఆసియా దేశాలు (నేపాల్, భూటాన్ మరియు బంగ్లాదేశ్) వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ప్రపంచస్థాయి నాణ్యత కలిగిన మేక్-ఇన్-ఇండియా ఉత్పత్తులను అందించాలనే తన సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ మైలురాయి వేడుకలలో, నవోహిరో యమగూచి, ప్రెసిడెంట్ మరియు రిప్రెసెంటేటివ్ డైరెక్టర్, సీఈఓ, ఇసుజు మొటార్స్ లిమిటెడ్ జపాన్ మరియు షిగేరు వాకబయాషి, గ్రూప్ సీఈఓ, మొబిలిటి గ్రూప్, మిట్సుభిషి కార్పొరేషన్, జపాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డా. ఎన్. యువరాజ్, ఐఏఎస్, సెక్రెటరీ, పరిశ్రమలు & వాణిజ్యము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు డా. రవీంద్ర సన్నా రెడ్డి, వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ సిటి మరియు ఐఎంఐ నుండి ఇతర ప్రముఖులు మరియు ప్రతినిధి సభ్యులు కూడా వేడుకకు హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ. నవోహిరో యమగూచి, ప్రెసిడెంట్ మరియు రిప్రెసెంటేటివ్ డైరెక్టర్, సీఈఓ, ఇసుజు మొటార్స్ లిమిటెడ్ జపాన్ గత దశాబ్దములో ఇసుజు మోటార్స్ సాధించిన పురోగతి మరియు విజయాల గురించి తన అభిమానాన్ని వ్యక్తపరచారు. “మా సమిష్ఠి అంకితభావం మరియు కృషి గణనీయమైన ఫలితాలను అందించాయి. 2022 ఆర్ధిక సంవత్సరములో, ఐఎంఐ స్థిరమైన లాభాల బాటలో నడిచింది, అలాగే మా ఎగుమతి వ్యాపారము కూడా అభివృచి చెందింది. భవిష్యత్తులో, దేశీయ మార్కెట్ లో అభివృద్ధిని వేగవంతం చేస్తూ మా ఎగుమతి వ్యాపారాన్ని బలోపేతం చేయడముపై మా దృష్టి ఉంటుందన్నారు.
షిగేరు వాకబయాషి, గ్రూప్ సీఈఓ, మొబిలిటి గ్రూప్, మిట్సుభిషి కార్పొరేషన్, జపాన్ మాట్లాడుతూ, “ఐఎంఐ యొక్క వ్యాపార పునాదులపై నిర్మించబడిన మా 10వ వార్షికోత్సవం జరుపుకోవడానికి నేనెంతో గర్విస్తున్నాను. ఇకపై, మా దేశీయ వినియోగదారులకు దగ్గరగా ఉండడం, వారి అవసరాలను అర్థం చేసుకోవడం, వారికి తగిన వాహనాలు మరియు సేవలను రూపొందించడము వంటివి ముఖ్యం అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా, ఇసుజు ఎప్పుడు రవాణ, ప్రజల రోజువారి జీవితాలు మరియు సమాజానికి మద్ధతు ఇచ్చింది మరియు భారతదేశములో కూడా ఈ పాత్రను మరింత విస్తరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ విజయము గురించి వ్యాఖ్యానిస్తూ రాజేష్ మిట్టల్, ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా, ఇలా అన్నారు, “గత పది సంవత్సరాలు ఇసుజు మోటార్స్ ఇండియాకు ముఖ్యమైనవిగా నిలిచాయి మరియు మా శ్రీ సిటి సదుపాయము ఇందులో కీలకపాత్ర పోషించింది. మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా వాహనాల నుండి ఒక లక్ష వాహనాల మైలురాయి మరియు మా ఎగుమతుల వరకు, ఈ ప్రయాణము ఇసుజు, తన ఉద్యోగులు, డీలర్ భాగస్వాముల నిబద్ధతను మరియు మా వినియోగదారుల నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. ఇటీవలి కాలములో, ఐఎంఐ వ్యాపారము మరియు కార్యకలాపాలలో మంచి ప్రజాదరణ పొందింది. దీని ఫలితంగా గత సంవత్సరము కంటే 2.5 రెట్లు లాభాలను చవిచూసిందని తెలిపారు.