సమాచార హక్కు చట్టం సాధన కమిటీ గ్రామ అధ్యక్షుడిగా వంశీ

27-10-2026 | 10:34pm

భిక్కనూర్, అక్టోబర్‌ 27 (విజయక్రాంతి): భిక్కనూర్‌ మండలం ఇసన్నపల్లి గ్రామ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ అధ్యక్షుడిగా గుడిసె వంశీ(Gudise Vamshi) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ‘పల్లెకు ప్రతినిధి’ కార్యక్రమంలో భాగంగా ఏడో కమిటీని ఏర్పాటు చేసినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ నియామకానికి సహకరించిన కామారెడ్డి నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షుడు బొడ్డు నరేష్‌కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కె. సాయిరామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు