టైర్లు వేడెక్కి లారీకి అంటుకున్న మంటలు..
క్షేమంగా బయటపడ్డ డ్రైవర్, క్లీనర్
సుల్తానాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli district) సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద రాజీవ్ రహదారి పై టైర్లు వేడెక్కి మంటలు వచ్చి లారీకి అంటుకున్నాయి. కాట్నపల్లి శివారులో ఈ ఘటన జరిగింది. ఏపీ నుంచి చేపల లోడుతో డిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముందు టైర్లు అగ్నికి ఆహుతై మంటలు లారీ మొత్తానికి వ్యాపించాయి. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ ఇద్దరు వెంటనే కిందికి దిగిపోవడంతోప్రాణాపాయం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో రాజీవ్ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు..