రైతులకు ఇబ్బందులొస్తే సహించేది లేదు..

27-10-2026 | 10:47pm

ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలి!

కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.. 

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా..

ఆలేరు, అక్టోబర్ 27 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbham Anil Kumar Reddy) ప్రారంభించారు. పీఏసీఎస్ అనాజిపురం, ఐకేపీ నందనం, పీఏసీఎస్ గౌస్‌నగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ప్రారంభించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినప్పుడు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి, చందుపట్ల పీఏసీఎస్ చైర్మన్లు పక్కిర్ కొండల్ రెడ్డి, జీలుగు సతీష్ పవన్, ఆత్మ కమిటీ చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లంల జంగయ్య యాదవ్, స్థానిక సర్పంచులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పీఏసీఎస్ డైరెక్టర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు