క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్
సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్ల పంపిణీ
పటాన్‌చెరు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) క్రీడాకారులకు అండగా నిలుస్తూ, ఢిల్లీలో నవంబర్ 1 నుంచి 5 వరకు జరిగే 70వ జాతీయస్థాయి స్కూల్ గేమ్స్(70th National School Games) కుస్తీ పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొనే అండర్-17 బాలబాలికల జట్లకు సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నామని, తెలంగాణ జట్టు జాతీయస్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జట్టు కోసం రూ.1.50 లక్షలతో స్పోర్ట్స్ కిట్లు, భోజన వసతి, ప్రయాణ ఖర్చులను అందించినట్లు తెలిపారు.