ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నిజాంసాగర్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అనుగుణంగా కామారెడ్డి జిల్లా(Kamareddy District) నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో మంగుళూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(Paddy Procurement Center) జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు(MLA Thota Lakshmikantha Rao) బుధవారం నాడు ప్రారంభించారు.
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి గిట్టుబాటు ధరను పొందాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులకు సన్నబడ్లకు బోనస్ అందిస్తుంది అన్నారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, సహకార సంఘ చైర్మన్ కయ్యం నరసింహారెడ్డి,నిజాంసాగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజాపండరి, స్థానిక సర్పంచ్ రాజు,నాయకులు,సంకు లక్ష్మయ్య, గుర్రపు శ్రీనివాస్, చాకలి సాయిలు, జగన్, సహకార సంఘ సీఈవో సంగమేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.