సమాజ సేవ కోసమే ప్రజల ముందుకు

30-09-2026 | 09:58pm

నిర్మల్ సెప్టెంబర్ 30 ( విజయ క్రాంతి): నిర్మల్ నియోజకవర్గం(Nirmal Constituency) అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సమాజ సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నల్ల వినయ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ లక్ష్మణ చందా మామడ సారంగాపూర్ మండలాల్లో పర్యటించి గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.

తన కుటుంబ సభ్యులైన నల్ల నరేందర్ రెడ్డి రామ్ రెడ్డి నల్ల కల్పన నల్ల భూమిరెడ్డి ప్రోత్సాహంతోని తాను సామాజిక సేవా కార్యక్రమాలను నిర్మల్ నియోజకవర్గం ప్రజలు తమకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఇదే స్ఫూర్తి ముందుకు వెళ్తానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు