మగ్దంపల్లిలో భూ రీ సర్వే

31-10-2026 | 10:31pm

మునిపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూ రీ సర్వేల్లో భాగంగా మునిపల్లి మండలం మగ్దంపల్లి గ్రామంలో డివిజనల్ సర్వేయర్ రాజు, మునిపల్లి తహసిల్దార్ రంగారావుతో కలిసి భూ రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూ కొలతల జిల్లా అధికారి ఇనేష్ మాట్లాడారు.  రాష్ట్ర ప్రభుత్వం భూముల అన్నిటిని డిజిటల్లైజేషన్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

అందుకు ప్రతి ఒక్క సర్వే నంబర్లను సబ్ డివిజన్ వారీగా కొలుస్తూ గ్రామ కంటాన్ని, గ్రామంలో ఉన్న చెరువులు,  కుంటలను ప్రతి ఒక్క వాటిని గుర్తిస్తూ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులందరూ ఈ కార్యక్రమంలో రైతులందరూ పాల్గొని అధికారులకు సహకరించగలరని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్వే ఇన్చార్జ్ డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, మండల సర్వేయర్  లాల్ సింగ్, గ్రామ సర్పంచ్ సరళ, ఉప సర్పంచ్ రామలక్ష్మి,  గ్రామ పాలన అధికారి రాజు,  సర్వేలు శ్రీనివాస్, అంబయ్య, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు