యువ ఆవిష్కర్తలకు గీతం ఇన్నోవేషన్ ఛాలెంజ్ -2026
రూ.50 లక్షల వరకు నగదు బహుమతులు.. డిసెంబర్ 11న గ్రాండ్ ఫైనల్
పటాన్ చెరు, నవంబర్ 3: యువతలోని సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించి, వాటిని విజయవంతమైన స్టార్టప్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం(GITAM Deemed University) ఆరోసారి జాతీయ స్థాయి గీతం ఇన్నోవేషన్ ఛాలెంజ్(GITAM Innovation Challenge) (జీఐసీ)–2026 నిర్వహిస్తోంది. ఈ పోటీలో విజేతలకు మొత్తం రూ.50 లక్షల వరకు నగదు బహుమతులతో పాటు నిపుణుల మార్గదర్శకత్వం, వెంచర్ కోచింగ్, ఇంక్యుబేషన్ అవకాశాలు కల్పించనున్నారు.
10 నుంచి 12వ తరగతి విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 2025 నుంచి పట్టభద్రులైన వారు ఈ పోటీలో పాల్గొనవచ్చు. జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించే ఈ పోటీలో వాతావరణ మార్పులు, వ్యవసాయం, ఆరోగ్యం, బయోటెక్నాలజీ, డీప్ టెక్నాలజీ, ఫుడ్ టెక్, సుస్థిరత తదితర రంగాల్లో వినూత్న ఆలోచనలను ఆహ్వానిస్తున్నారు.
ఆన్లైన్ స్క్రీనింగ్, వర్చువల్ బూట్ క్యాంప్, మెంటరింగ్, సెమీ ఫైనల్స్ అనంతరం డిసెంబర్ 11న గీతం హైదరాబాద్ ప్రాంగణంలో జాతీయ స్థాయి గ్రాండ్ ఫైనల్ నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 7వ తేదీలోగా జీఐసీ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు 90630 65811, 83283 34930 నంబర్లను లేదా gic@gitam.edu ద్వారా సంప్రదించవచ్చు.