ఎస్‌ఏ–1 పేపర్ల దిద్దుబాటు షురూ

08-10-2026 | 05:35pm

నాగల్‌గిద్ద, అక్టోబర్ 8 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు నిర్వహించిన ఎస్‌ఏ–1 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. క్యాంపు ఆఫీసర్ హిరామన్, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ రవీందర్‌రావు పర్యవేక్షణలో మూల్యాంకన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా మండల విద్యాధికారి మన్మథ కిషోర్ శిబిరాన్ని సందర్శించి జవాబు పత్రాల మూల్యాంకన సరళిని పరిశీలించారు. విద్యార్థుల జవాబు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం మార్కులు కేటాయించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మూల్యాంకనంలో పారదర్శకత పాటిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు మూల్యాంకన ప్రక్రియలో పాల్గొంటున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థుల మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు క్యాంపు ఆఫీసర్ హెరామన్, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ రవీందర్‌రావు వెల్లడించారు.

మరిన్ని వార్తలు