రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ వాలీబాల్ పోటీలకు సీ ఓ ఈ విద్యార్థి ఎంపిక

08-10-2026 | 06:49pm

బెల్లంపల్లి: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(Telangana Social Welfare Gurukul School) సెంట్రల్ ఆప్ ఎక్సలెన్స్ (సీ వో ఈ) ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థి ముడిమడుగుల హర్షిత్ అండర్ 19 రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ అకిడి విజయసాగర్  తెలిపారు.

ఎంపికైన విద్యార్థి ఉమ్మడి ఈనెల 9 నుంచి 11 వరకు మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల మండలం రంగారెడ్డి గూడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయసాగర్ మాట్లాడుతూ వాలీబాల్ రాష్ట్ర స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో ఎంపికవ్వాలని ఆకాక్షించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ తన్నీరు గోపి, ఉపాధ్యాయ బృందం విద్యార్థికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులు అల్లూరి వామన్ ముచ్చకుర్తి రాజశేఖర్ విద్యార్థికి ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ తెలిపే పుష్ప గుచ్చి ఇచ్చారు.

మరిన్ని వార్తలు