చికిత్స పొందుతూ ఆర్ఎంపి మృతి
గంభీరావుపేట సెప్టెంబర్ 27(విజయక్రాంతి): గంభీరావుపేట(Gambhiraopet) మండలంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని కోలమద్ది గ్రామానికి చెందిన ఎడబోయిన నారాయణ (43) ( ఆర్ఎంపి(RMP), విలేఖరి )అనారోగ్యంతో మృతి చెందాడు. అనారోగ్యానికి గురైన ఆయనను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించగా, పరిస్థితి విషమించి కన్నుమూశాడు. మృతుడు నారాయణకు భార్య సరిత కూతుర్లు ప్రణవి(13), శ్రీనిత్య (9)కుమారుడు సుహాన్స్(5) ఉన్నారు. కుటుంబానికి అండగా నిలిచిన నారాయణ ఆకస్మిక మృతి గ్రామంలో విషాదాన్ని నింపింది.
ప్రభుత్వం ఆదుకోవాలి
చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించిన నారాయణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మండల ఆర్‌ఎంపీ, పి.ఎం.పి అసోసియేషన్ అధ్యక్షుడు చేపూరి సత్యనారాయణ, టి యుడబ్ల్యూ జె మండల అధ్యక్షుడు అబ్దుల్ రహీం, గ్రామ సర్పంచ్ ఎడబోయిన దిలీప్ విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ జీవనోపాధి పొందుతున్న ఆర్‌ఎంపీ మృతి చెందడం వల్ల కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని, ప్రభుత్వం స్పందించి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు.