ధాన్యం కొనుగోలుకు కేంద్రాలు సిద్ధం
కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై ప్యాక్స్ చైర్మన్ చేపూరి గంగాధర్ ప్రత్యేక దృష్టి
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొనుగోలు కేంద్రాలను(Paddy procurement centers) సిద్ధం చేసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్యాక్స్ చైర్మన్ చేపూరి గంగాధర్(PACS Chairman Chepuri Gangadhar) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. కేంద్రాల పరిసరాలను శుభ్రం చేసి, ధాన్యం కొనుగోలుకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. రైతులు(Farmers) పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడంతో పాటు, విక్రయించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచి, అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. రైతులకు సౌకర్యవంతంగా ధాన్యం విక్రయించే అవకాశం కల్పించడమే లక్ష్యంగా కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్యాక్స్ చైర్మన్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఈ సందర్శనలో డైరెక్టర్లు ముధం సత్యం, మ్యాకల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ముదాం ప్రదీప్, వార్డ్ మెంబర్ బత్తుల దీపక్, రైతులు రాస రత్నాకర్,పాతకాల ప్రకాశం, కులేరు చంద్రయ్య, కస్తూరి మధుకర్, లింబయ్య,సదానందం, సీఈవో కేశవులు, సిబ్బంది జనార్దన్,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.