క్యూ లాంజ్ స్నూకర్ క్లబ్ ప్రారంభం
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ చైతన్యపురి కాలనీలోని నూతనంగా ఏర్పాటు చేసిన 'ది క్యూ లాంజ్' స్నూకర్ క్లబ్(The Q Lounge Snooker Club) ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్(Mayor Kolagani Srinivas), బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి స్నూకర్ క్లబ్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు నగర ప్రజలకు, ముఖ్యంగా యువతకు రిక్రియేషన్, గేమింగ్, రుచికరమైన ఫుడ్ మరియు బెవరేజెస్ మరియు చక్కటి రిలాక్సేషన్ అందించేందుకు ఈ లాంజ్ వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, గాజ శివరాం, సోమిడి వేణు, పెద్దపల్లి జితేందర్, నాయకులు కటకం లోకేష్, స్నూకర్ క్లబ్ యాజమాన్యులు, తదితరులు పాల్గొన్నారు.