నైతం రాజు మృతి ఆదివాసీ ఉద్యమానికి తీరని లోటు
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దుర్గం దినకర్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(Telangana Adivasi Tribal Association) కొమురం భీం జిల్లా ఉపాధ్యక్షుడు నైతం రాజు మృతి ఆదివాసీ, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దుర్గం దినకర్(CPM leader Durgam Dinakar) అన్నారు. చిన్న వయసులోనే అనారోగ్యంతో ఆయన మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. 2017లో రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో నిర్వహించిన నాలుగు వేల కిలోమీటర్ల మహాజన పాదయాత్ర(Mahajana Padayatra)లో నైతం రాజు సభ్యుడిగా పాల్గొన్నారని గుర్తుచేశారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన ఆయన మరణం ఉద్యమాలకు తీరని లోటని పేర్కొంటూ, రాజుకు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.