సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన చైర్‌పర్సన్
మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి
హుజురాబాద్,(విజయక్రాంతి): సద్దుల బతుకమ్మ వేడుకల(Saddula Bathukamma Festival)ను పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని బతుకమ్మ ప్రదేశాల్లో చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని(Municipal Chairperson Rontala Suhasini) పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బతుకమ్మ ఆడే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
బతుకమ్మల నిమజ్జనం చేసే నీటి ప్రదేశాలను శుభ్రపరచడంతో పాటు మహిళలకు సౌకర్యంగా ఉండేలా అవసరమైన చోట్ల వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పండుగకు వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ తిరుపతి, కౌన్సిలర్లు సునీత బాబు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, భాస్కర్, పుణ్య బాబు, ఏఈ నరేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిరణ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ వినయ్, జవాన్లు రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.