భక్తుల సౌకర్యార్థం సీలింగ్ ఫ్యాన్ లు అందజేత
12-10-2026 | 05:40pm
చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial district) చెన్నూర్ పట్టణంలోని లక్ష్మీదేవార ఆలయ(Lakshmidevara Temple) భక్తుల సౌకర్యార్థం వివేక్ యువసేన అధ్యక్షులు తనుగుల రవికుమార్ సోమవారం సీలింగ్ ఫ్యాన్ లను కమిటీ సభ్యులకు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆలయంలో దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే సదుద్దేశంతో తన వంతు సేవగా ఫ్యాన్ లను అమ్మవారి ఆలయానికి అందజేయడం ఆనందంగా ఉందన్నారు. భక్తుల సేవలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని, గడ్డం బ్రదర్స్ ఆశీస్సులతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉంటానన్నారు. ఆలయ కమిటీ సభ్యులు తనుగుల రవికుమార్ ను అభినందించారు.