ప్రజావాణిలో ఒకే ఒక ఫిర్యాదు

12-10-2026 | 05:53pm

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు(Prajavani Complaint) కరువయ్యాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఒకే ఒక ఫిర్యాదు వచ్చినట్లు ఎంపీడీవో గంగాధర్(MPDO Gangadhar) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవడం లేదని, కావున ప్రతి ఒక్కరు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటే సమస్యలు త్వరగా సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్,ఎమ్మార్వో వెంకటరెడ్డి,ఎంపీఓ ప్రభాకర్ చారి,వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు