ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలి
జిల్లా కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): యువత ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలను పెంపొందించుకుని మంచి ఉద్యోగాలు సాధించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత(Collector Haritha) సూచించారు. సోమవారం ఆసిఫాబాద్‌లోని టాస్క్ ప్రాంతీయ కేంద్రం(TASK regional center)లో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వృత్తిపరమైన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. నైపుణ్యాభివృద్ధితో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ప్రాంతీయ కేంద్రం మేనేజర్ రాకేష్, డీడీఎం జి. సాయికుమార్ పాల్గొన్నారు.