సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

12-10-2026 | 05:06pm

సీపీ రష్మీ పెరుమాళ్

సిద్దిపేట,(విజయక్రాంతి): సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్(CP Rashmi Perumal) సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల(Siddipet Government Medical College)లో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

తెలియని వ్యక్తులకు ఓటీపీ, పిన్ వివరాలు వెల్లడించవద్దని, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని, సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్‌గా ఉంచుకోవాలని సూచించారు. పబ్లిక్ వై-ఫై వినియోగం, ఆన్‌లైన్ గేమింగ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు.

మరిన్ని వార్తలు