శిథిలావస్థకు చేరిన ఎంఈఓ కార్యాలయం

18-09-2026 | 04:30pm

దర్వాజాలు, కిటికీలు పాడైపోయినా పట్టించుకోని అధికారులు

కోనరావుపేట, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి):కోనరావుపేట మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ)(Education Department Officer) కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. కార్యాలయంలోని దర్వాజాలు, కిటికీలు చెదలు పట్టి, తుప్పు పట్టి పాడైపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కార్యాలయ నిర్వహణ సరిగా లేకపోవడంతో సిబ్బందికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.

కార్యాలయంలో కంప్యూటర్లు, ఇతర విలువైన సామగ్రి ఉండడంతో పాడైపోయిన దర్వాజాలు, కిటికీల కారణంగా భద్రతపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.కనీసం కార్యాలయానికి మరమ్మతులు చేపట్టి, దర్వాజాలు, కిటికీలను బాగు చేయాలన్న ఆలోచన కూడా అధికారులు చేయకపోవడం గమనార్హమని స్థానికులు పేర్కొంటున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎంఈఓ కార్యాలయానికి మరమ్మతులు చేపట్టి, దర్వాజాలు, కిటికీలను సరిచేసి సౌకర్యవంతంగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు