దళిత బస్తీ పేరుతో లక్షలు వాసులు చేసిన బీఆర్ఎస్ నాయకులు..

18-09-2026 | 05:13pm

గుబిడి రోడ్డును రాజురకు మార్చిన ఎమ్మెల్యే..

మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డీ భోజ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకుల ఖండన..

తాంసి/భీంపూర్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో బీఆర్ఎస్ నాయకులు దళిత బస్తీ, దళిత బంధు పేరుతో లబ్ధిదారుల నుండి లక్షల్లో వసూలు చేశారని కాంగ్రెస్ నాయకుడు దాసరి రమేష్(Congress leader Dasari Ramesh) ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన మారకుంటే మీరు చేసిన అవినీతిని ఆధారాలతో సహా బయట పెడతామని హెచ్చరించారు.

శుక్రవారం భీంపూర్ మండల కేంద్రంలో తాంసి, భీంపూర్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల తాంసి, భీంపూర్, తలమడుగు మండలాల బీఆర్ఎస్ నాయకులు తాంసి మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరిగిందని, లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణను, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డీ భోజ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డీ భోజ రెడ్డిని విమర్శించే స్థాయి మండల నాయకులకు లేదని అన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గతంలో పార్టీలు మారలేదా అని ప్రశ్నించారు. డిలిమిటేషన్ అవుతుందనే ఎమ్మెల్యే ఈ మూడు మండలాలకు పట్టించుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భీంపూర్ మండలం గుబిడి గ్రామానికి రూ.6 కోట్లతో బీటీ రోడ్డు మంజూరు చేస్తే ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆ నిధులను రాజురకు మార్చారని ఆరోపించారు. అభివృద్ధి చేయకుండా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు