రామగుండం కమిషనరేట్లో ఘనంగా గణనాథుని నిమజ్జనం
18-09-2026 | 05:34pm
రామగుండం, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్(Ramagundam Police Commissionerate) ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి సీపీ అంబర్ కిషోర్ ఝా(CP Amber Kishore Jha) ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది, మహిళలు, చిన్నారుల కోలాటాలు, ఆటపాటల మధ్య గణనాథుని శోభాయాత్రను సీపీ ప్రారంభించారు.
డప్పు వాయిద్యాల నడుమ కొనసాగిన శోభాయాత్ర అనంతరం గణనాథుని గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ కె.శ్రీనివాస్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.