బీడీ కార్మికుల సమస్యల పరిష్కారంలో మరింత ముందుకు వెళ్ళండి
18-09-2026 | 05:12pm
బోథ్ సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి) బీడీ కార్మికుల (Beedi workers)సమస్యల పరిష్కారానికి మరింత ముందుకు వెళ్లాలని బోత్ పట్టణ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ కోరారు. శుక్రవారం జాతీయస్థాయి బీడీ కార్మిక సంఘం (National-level Beedi Workers' Union) ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన బి గోవర్ధన్ ను ఆయన సన్మానించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ఈయనను జాతీయ స్థాయి నాయకునిగా గుర్తింపు పొందడం అభినంద నియమన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు రమణ గౌడ్ చిలుకూరి రమణ, చిన్నయ్య, కొండ మహేందర్ పాటిల్, విద్యార్థి సంఘం నాయకుడు కొత్తూరు ప్రవీణ్, శైలేందర్ తదితరులు ఉన్నారు.