గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

18-09-2026 | 05:24pm

వెల్దండ సెప్టెంబర్ 18: శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారి(Srisailam–Hyderabad National Highway)పై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వెల్దండ మండల శివారు ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన మిద్దె చిన్న నరసింహ(58) రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు