బెల్టు షాపులు నిర్వహించవద్దు

24-10-2026 | 07:08pm

చందుర్తి, అక్టోబర్ 24,(విజయక్రాంతి) : మండలంలోని మర్రిగడ్డ గ్రామంలో(Marrigadda Village) మద్యం అమ్మకాలను(liquor sales) నిషేదిస్తూ గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మాణం చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టుషాపులను(Belt shops) మూసేయాలని నిర్ణయించారు.01 నవంబర్ నుండి బెల్టుషాపులు(Belt shops) నిర్వహిస్తే పదివేల రూపాయల జరిమాన విధించబడునని,అలాగే   ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లి చట్టరీత్య చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.

ఈ నిర్ణయాన్ని గ్రామ ప్రజలు అభినందించారు. ఈ సమావేశంలో సర్పంచ్ దూది మనీష,ఉప సర్పంచ్ ఏరెడ్డి ప్రవీణ్,సెక్రటరీ ,వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు