లోక్‌ అదాలత్‌లో ప్రతిభకు ప్రశంస

24-10-2026 | 07:21pm

సీనియర్‌ జడ్జి సురేష్

కోదాడ అక్టోబర్ 24(విజయక్రాంతి) : లోక్‌ అదాలత్‌(Lok Adalat) ద్వారా కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేసిన పోలీసు అధికారులు(Police officers), సిబ్బంది, న్యాయవాదులను కోర్టు సీనియర్‌ జడ్జి సురేష్‌ అభినందించారు. ఇటీవల కోదాడ కోర్టులో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేందుకు విశేషంగా కృషి చేసిన వారికి శనివారం ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా సీనియర్‌ జడ్జి సురేష్‌ మాట్లాడుతూ.. రాజీమార్గంలో కేసులను పరిష్కరించేందుకు లోక్‌ అదాలత్‌లు(Lok Adalat) ఎంతో దోహదపడతాయన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంతో పాటు సమయం, వ్యయం ఆదా చేయడంలో వీటి పాత్ర కీలకమని పేర్కొన్నారు.

ఇటీవల నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారానికి పోలీసులు, న్యాయవాదులు(Lawyers) సమన్వయంతో పనిచేయడం అభినందనీయమన్నారు. లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి కృషి చేసిన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కోదాడ టౌన్‌ సీఐ శివశంకర్, మునగాల సీఐ రామకృష్ణారెడ్డితో పాటు కోదాడ టౌన్‌, రూరల్‌, అనంతగిరి, మునగాల, నడిగూడెం, చిలుకూరు, మోతే పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు, కోర్టు కానిస్టేబుల్‌, న్యాయవాదులకు సీనియర్‌ జడ్జి సురేష్‌ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.

మరిన్ని వార్తలు