రైస్ మిల్ ను పరిశీలించిన ఎంపీడివో

24-10-2026 | 07:18pm

సదాశివ నగర్, అక్టోబర్ 24 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామం లో గ్రామ పంచాయతీ(Village Panchayat) అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన గోదాం నిర్మాణ పనులను(Warehouse construction works) ఎంపిడివో సంతోష్ కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ ప్రజల అభిప్రాయం మేరకే అధికారులు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. బాయిల్డ్, రా రైస్ మిల్ లతో గ్రామానికి ముప్పు పొంచి ఉందని ఈ నిర్ణయన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు.

గ్రామంలో ఇది వరకే పొల్యూషన్ తో ఇబ్బందులు తలెత్తుతున్నాయని  మళ్ళీ అనుమతి ఇస్తే గ్రామంలో గందరగోళ పరిస్థితి ఏర్పడి గ్రామం ఖాళీ చెయ్యాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రజావాణి లో వచ్చిన పిర్యాదు మేరకు ఎం పి డి వో విచారణ చేపట్టారు.రైస్ మిల్ రద్దు కై గ్రామ సభ లో సైతం గ్రామస్థుల తీర్మానం చేసినట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమం లో సర్పంచ్ ఎడ్ల నర్సింలు, బోలిపల్లి మహేందర్ రెడ్డి,మోసర్ల శ్రీకాంత్ రెడ్డి,పయ్యావుల చంద్రం, అస మహేష్, పోతారాజు నరేష్, కుమ్మరి శ్రవణ్,ఎలాగారి రాజయ్య, ఎలాగారి రాజేష్, వార్డు మెంబెర్స్ ఎడ్ల నందు, రేఖ రంజిత్, కవిత సురేందర్, అబ్బాస్,అశోక్, శివ, మంగలి వేణు, మేర శ్రీకాంత్, పంచాయతీ సెక్రటరీ వెంకట్, కారోబార్ బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు