ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
రుద్రంగి అక్టోబర్ 09(విజయక్రాంతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) రుద్రంగి మండలకేంద్రంలోని కేరళ గ్లోబల్ హై స్కూల్(Kerala Global High School) ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు(Students) రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మ పాటలతో(Bathukamma songs) ఆడిపాడారు.ఈ సందర్బంగా కేరళ స్కూల్ చైర్మన్ బాబు నంబియర్ కరస్పాండెంట్ లతికా మాట్లాడుతూ.విద్యార్థులు చదువుతో పాటు మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుని గౌరవించాలని అన్నారు.
ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో ఐక్యత, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని తెలిపారు,తెలంగాణ అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పెరు అని అన్నారు. తెలంగాణ అడపడుచులందరు ఘనంగా జరుపుకునే ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు.
చిన్నారులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ కొలటలు వేస్తూ ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు.రుద్రంగి మండల ప్రజలకు మరియు కేరళ స్కూల్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ఇంచార్జ్ నరిగే విజయ్,యాజమాన్యం మరియు టీచర్లు పాల్గొన్నారు.