ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

09-10-2026 | 07:08pm

శ్రీ నేతాజీ పాఠశాల

సంప్రదాయ పూలతో సంబరంగా వేడుకలు

గణపురం,అక్టోబర్ 09 (విజయ క్రాంతి): గణపురం మండలం(Ganapuram Mandal) బస్వరాజుపల్లి గ్రామంలోని శ్రీ నేతాజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో(Sri Netaji English Medium School) శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను(Bathukamma celebrations) ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ ఉడుత సాంబయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను చాటుతూ పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి సంబరాలు జరుపుకున్నారు. పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొనగా, విద్యార్థులు సంప్రదాయ పద్ధతిలో వేడుకల్లో పాల్గొని ఆనందంగా గడిపారు.

మరిన్ని వార్తలు