మంత్రి తుమ్మల, ఆయిల్ ఫెడ్ అధికారులు కీలక సమావేశం

09-10-2026 | 06:57pm

పాల్గొన్న తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ 

 *మంత్రి తుమ్మలకు ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలపై వినతిపత్రం సమర్పణ

దమ్మపేట, అక్టోబర్ (విజయ క్రాంతి): హైదరాబాదులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) సమక్షంలో ఆయిల్ ఫామ్(Oil Palm) అధికారుల కీలక సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్(Alapati Prasad) పాల్గొన్నారు.  ఈ సమావేశంలో మంత్రి తుమ్మలకు తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతు(Telangana Oil Palm Farmer) సమస్యలు, తీసుకోవలసిన చర్యలు పై లిఖిత పూర్వకంగా వినతి పత్రం అందజేశారు.

భారతదేశంలోనే ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణను నెంబర్ వన్ గా చేయటములో, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేలా తీసుకుంటున్న చర్యలపై మంత్రి తుమ్మల వివరిస్తూ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.  ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్లుతున్న రైతులకు మొక్కల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే విధంగా చూడాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతుల పరిస్థితి, ఆయిల్ ఫామ్ సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం, ఆయిల్ ఫామ్ గెలల టన్ను ధర మినిమం 25వేల రూపాయలు ఉండే విధంగా తీసుకోవలసిన చర్యలపై ఆలపాటి ప్రసాద్ మంత్రి తుమ్మలకు లిఖితపూర్వకంగా వినతి పత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు