అభయహస్తం పథకం అమలు చేయాలి

09-10-2026 | 07:01pm

నిర్మల్ అక్టోబర్ 9 ( విజయ క్రాంతి) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో(Congress Party's Election Manifesto)  హామీ ఇచ్చిన ప్రభుత్వ చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ సభలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అంబేద్కర్‌ అభయహస్తం పథకాన్ని(Ambedkar Abhayahastam Scheme) అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మాదిగ హక్కుల పరిరక్షణ సమితి(Madiga Rights Protection Committee) డిమాండ్ చేశారు. సమితిఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్‌ జిల్లా(Nirmal District) కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్‌ మాదిగ మాట్లాడుతూ.. చేవెళ్ల డిక్లరేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని, ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. మూడేళ్లు గడుస్తున్నా పథకం అమలుకు నోచుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.

అంబేద్కర్‌ అభయహస్తం పథకం అమలుపై కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకె ప్రభాకర్‌, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బొమ్మెన తిరుపతి, జనసాహిత్య అకాడమీ చైర్మన్‌ పాముల రమణ, నరేష్‌, కత్తి విష్ణు, దాసరి శివ, రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు