నంది మేడారంలో 18 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

09-10-2026 | 06:48pm
  1. రైస్ మిల్లుపై టాస్క్‌ఫోర్స్, పౌరసరఫరాల అధికారుల దాడులు
  2. మిల్లుయజమానితో పాటు ముగ్గురిపై కేసు నమోదు

పెద్దపల్లి, ధర్మారం,09 (పెద్దపల్లి) : నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని(Ration rice) అక్రమంగా నిల్వ చేసిన రైస్ మిల్లుపై(Rice mill) అధికారులు మెరుపు దాడి చేశారు. పెద్దపల్లి జిల్లా(Peddapalli District) ధర్మారం మండలం నంది మేడారంలోని ఓ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 18 క్వింటాళ్ల పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్, పౌరసరఫరాల శాఖ(Civil Supplies Department) అధికారులు పట్టుకున్నారు.

అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు సదరు మిల్లులో ఆకస్మిక తనిఖీలు(Surprise inspections) చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు 18 క్వింటాళ్ల రేషన్ బియ్యం నిల్వలు పట్టుబడ్డాయి. పేదల నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి, రీసైక్లింగ్ లేదా ఇతర మార్గాల ద్వారా అధిక ధరకు విక్రయించేందుకు నిల్వ ఉంచినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీజ్ చేసి సివిల్ సప్లైస్ గోదాముకు తరలించారు. అక్రమ దందాకు పాల్పడుతున్న రైస్ మిల్లు యజమానితో పాటు ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేదల బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసినా, నిల్వ ఉంచి విక్రయించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు