జాతీయ స్థాయి క్రికెట్‌కు బత్తుల అక్షర ఎంపిక
తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఘన సన్మానం
క్రీడాకారిణికి క్రికెట్ కిట్ అందిస్తానన్న గజ్జెల దేవరాజ్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట్ గ్రామానికి చెందిన బత్తుల అక్షర జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం పట్ల తెలంగాణ ఉద్యమకారుల(Telangana activists) రాజన్న సిరిసిల్ల జిల్లా JAC ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్ లో జెఏసి చైర్మన్ గజ్జెల దేవరాజ్ ఆధ్వర్యంలో అక్షరను ఘనంగా సన్మానించారు. బత్తుల నర్సిములు–లక్ష్మి దంపతుల కుమార్తె అక్షర మల్లారెడ్డిపేట్ ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసిస్తూ క్రికెట్‌లో శిక్షణ పొందింది.
పిఈటి నరేష్, ఫిజికల్ డైరెక్టర్ పొన్నం మహేందర్‌ల సహకారంతో క్రీడలో రాణించింది.2019లో సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. 2025లో ఖమ్మం, 2026లో సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న అక్షర, ప్రస్తుతం సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాల పి ఈ టీ డేవిడ్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది జమ్మూ కాశ్మీర్‌లో జరిగే జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైంది.
ఈ సందర్భంగా జె ఏ సి చైర్మన్ గజ్జెల దేవరాజ్ మాట్లాడుతూ అక్షర క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు తనవంతుగా క్రికెట్ కిట్ అందిస్తానని తెలిపారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా స్పందించి అక్షరకు అవసరమైన సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల జె ఏ సి జిల్లా గౌరవ అధ్యక్షుడు బుస్స వేణు, రాచర్ల వెంకన్న, పత్తిపాక పద్మశంకర్, కర్నె లక్ష్మి, గూగులోతు రేణ, మడుగుల వనజ, నడిమెట్ల శ్రీనివాస్, అడ్వకేట్ పశుల బాబు, సీనియర్ ఉద్యమ నాయకులు బలుమూర్తి, షేక్ సికిందర్, సయ్యద్ అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.