కంచర్లలో కోలాటాలతో వినాయక నిమజ్జనం
భిక్కనూర్, సెప్టెంబర్ 23 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామం(Kancharla Village)లో మంగళవారం రాత్రి వినాయక నిమజ్జన వేడుకలను యువత ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామంలోని రుద్రసేన యూత్ అద్వర్యం లో నాగిరేశ్వర భజన మండలి సభ్యులతో కలిసి యువకులు కీర్తనలు, భజనలు చేస్తూ కోలాటాలు వేశారు. గణనాథుడి నిమజ్జన ఊరేగింపులో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
వేడుకలకు సీఐ జగడం నరేశ్, ఎస్ఐ అనిల్ కుమార్ హాజరై గ్రామంలో సంబరాలను వీక్షించారు. ఈ సందర్భంగా సీఐ జగడం నరేశ్ మాట్లాడుతూ, ఇలాంటి భక్తి కార్యక్రమాలు, ప్రదర్శనలతో వినాయకుడి నిమజ్జనం నిర్వహిస్తే భగవంతుడు కూడా తృప్తి చెందుతారని తెలిపారు. డీజేలకు దూరంగా ఉండి భజనలు, కీర్తనలతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామస్తులను ఎస్ఐ అనిల్ కుమార్ అభినందించారు.