ఆది దేవుని లడ్డూకు రికార్డు ధర
23-09-2026 | 01:00pm
మహబూబాబాద్, (విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం(Kesamudram) రైల్వే స్టేషన్ ఆవరణలో నిర్వహిస్తున్న ఆదిదేవ గణపతి ఉత్సవ సమితి మండలి వద్ద మంగళవారం రాత్రి లడ్డూ వేలంపాట నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా లడ్డును 3,55,111 రూపాయలకు వేలంపాటలో మంచన శంకరరావు అరుణ దేవి దంపతులు దక్కించుకున్నారు.