అప్పుల భారం.. యువకుడి విషాదాంతం
23-09-2026 | 12:50pm
బెల్లంపల్లి,( విజయక్రాంతి): అప్పుల భాధలకు తాళలేక ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెల్లంపల్లి మండలం చిన్నబూధ లో చోటుచేసుకున్నది. సంఘటన వివరాలిలా ఉన్నాయి. అప్పుల భాధలకు వేగలేక భార్య పిల్లతో కొంతకాలంగా గుడిపేటలో ఉన్నారు. చీకటి రాజేశం (40)బుధవారం ఒక్కడే తన చిన్నబూధకు వచ్చాడు. అర్దరాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించారు. ఈమేరకు తాళ్ళగురిజాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.