రామగుండంలో వినాయక మండపాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు
రామగుండం, సెప్టెంబర్ 15(విజయ క్రాంతి): రామగుండం నియోజకవర్గ(Ramagundam Constituency) శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ మంగళవారం 19వ డివిజన్ అల్లూరులోని శ్రీ అల్లూరు భక్తాంజనేయ వినాయక మండపాన్ని సందర్శించారు. మండపంలో కొలువుదీరిన శ్రీ వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వినాయక చవితి సందర్భంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని వినాయకుడిని ప్రార్థించారు. అనంతరం భక్తులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు, భక్తులతో ఎమ్మెల్యే మాట్లాడి వినాయక చవితి వేడుకల నిర్వహణపై ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ మారెల్లి సుశీల రాజిరెడ్డి, 17వ డివిజన్ కార్పొరేటర్ అనుము రాములు, 20వ డివిజన్ ఇన్చార్జ్ బండ రమేష్ రెడ్డి, కార్పొరేటర్ నీలాంటి రాము, జక్కుల దామోదర్, డివిజన్ అధ్యక్షులు మర్కా రాజు, మోత్కూరు శంకర్, కురండ్ల రాజిరెడ్డి, నాసారపు వెంకటేష్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.