గణపురం బీజేపీ మండల కన్వీనర్‌గా మంద మహేష్
15-09-2026 | 04:08pm
గణపురం, సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి): బీజేపీ(BJP) గణపురం మండల కన్వీనర్‌గా మంద మహేష్‌ను నియమించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి ప్రకటించారు.
మంద మహేష్ 2009 నుండి ఏబీవీపీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, బీజేవైఎం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వివిధ బాధ్యతలు నిర్వహించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పలు పోరాటాలు నిర్వహించడంతో పాటు తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థుల విజయానికి పలు ఎన్నికల్లో పనిచేశారు.
తన నియామకానికి సహకరించిన బీజేపీ భూపాలపల్లి అభ్యర్థి చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలకు మంద మహేష్ కృతజ్ఞతలు తెలిపారు.