నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
15-09-2026 | 04:04pm
దేశీయ స్టాక్ మార్కెట్లు(Indian Stock Market) మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 777.94 పాయింట్లు (1.04%) నష్టపోయి 74,003.82 వద్ద, నిఫ్టీ 279.50 పాయింట్లు (1.19%) తగ్గి 22,512.30 వద్ద స్థిరపడ్డాయి. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, సోనాటా సాఫ్ట్వేర్, ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ లాభాల్లో ఉండగా.. వెల్స్పన్ కార్ప్, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా, జిందాల్ సా షేర్లు నష్టపోయాయి.