విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించాలి

27-10-2026 | 06:28pm

పెద్దపల్లి జిల్లా ఏఎంవో  షేక్‌ డీవైఎస్‌ఓ సురేష్‌

సుల్తానాబాద్‌, అక్టోబర్‌ 27 (విజయక్రాంతి): విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని పెద్దపల్లి జిల్లా ఏఎంవో డా. షేక్‌, డీవైఎస్‌ఓ సురేష్‌లు(Peddapalli District AMO Dr. Shaik, DYSO Suresh) అన్నారు,  మంగళవారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లా స్థాయి క్రీడా పోటీలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, జట్టుగా పనిచేసే లక్షణాలనుఅలవర్చుతాయని పేర్కొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలనిసూచించారు.

పాఠశాల స్థాయి నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకుంటే భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించే అవకాశం ఉంటుందని తెలిపారు.ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలని కోరారు.పోటీల్లో భాగంగా మొదటి రోజు బాలికలకు అథ్లెటిక్స్‌, వాలీబాల్‌, కబడ్డీ క్రీడలను నిర్వహించారు.

పెద్దపల్లి జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్‌, నోడల్‌ ఆఫీసర్‌ టీ. శోభారాణి, స్పోర్ట్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్‌, పేట రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమ్ము రోజు శ్రీనివాస్, పేట అధ్యక్ష కార్యదర్శులు దాసరి రమేష్‌, సురేందర్, పీడీలు ప్రణయ్‌, జావీద్‌, వెంకటేష్, సదయ్య, డా.రవి, ప్రసాద్, శైలజ, ఖాజాబీ, అజ్జు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు