దాన్యం కొనుగోలు కేంద్రాలు
దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్, నవంబర్ 05 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(Peddapalli MLA Chintakunta Vijaya Ramana Rao) గురువారం ప్రారంభించారు.
మండలంలోని నారాయణరావుపల్లి, గొల్లపల్లి, సాంబయ్యపల్లి, దుబ్బపల్లి, ఐతరజ్ పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజురోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతున్న దృష్ట్యా రైతులు యాసంగి పంటల విషయంలో ఆలోచించి నీటి లభ్యతను బట్టి సాగు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్లు కల్లేపల్లి జానీ, చిలుక సతీష్ , సర్పంచులు. నామని రాజిరెడ్డి, కొత్తూరి స్వరూప, రవి, భాగ్యలక్ష్మి, సంపత్ రెడ్డి, ఉమ్మెత్తల శోభా, రవీందర్ రెడ్డి, దీకొండ భూమేష్, పోచంపల్లి చిన్నయ్య, వీరగోని రమేష్ గౌడ్, సీఈవో నవి, నాయకులు, రైతులు, హమాలీలు, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు..