రాజు కుటుంబాన్ని పరామర్శించిన నాగినేని జగన్మోహన్ రావు
23-10-2026 | 02:49pm
కమాన్‌పూర్, అక్టోబర్ 23 (విజయ క్రాంతి) కమాన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(Kamanpur Agricultural Market Committee) చైర్మన్ వైనాల రాజు తండ్రి స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న ముత్తారం మండల మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ నాగినేని జగన్మోహన్ రావు, కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుచ్చం రావు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా వైనాల రాజు కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి కలిగిన తీరని లోటు పట్ల విచారం వ్యక్తం చేశారు. దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో నాగినేని జగన్మోహన్ రావు, బుచ్చం రావు, డా.చారి తదితరులు పాల్గొన్నారు.