ఎంపీ నిధులతో హనుమాన్ ఆలయానికి నీటి సౌకర్యం
సుల్తానాబాద్, అక్టోబర్-24 (విజయ క్రాంతి): పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఎంపీ నిధుల నుంచి మంజూరైన రెండు లక్షల రూపాయల వ్యయంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్(Sultanabad) మండలంలోని గట్టేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న హనుమాన్ దేవాలయానికి ఏర్పాటు చేసిన బోర్‌వెల్ మోటార్‌ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించారు.
ఆలయానికి వచ్చే భక్తులకు, దేవాలయ అవసరాలకు నీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ బోర్‌వెల్ మోటార్‌ను ఏర్పాటు చేశారు. గ్రామంలోని హనుమాన్ దేవాలయానికి నీటి సౌకర్యం కల్పించేందుకు ఎంపీ నిధుల నుంచి రెండు లక్షలు మంజూరు కావడంతో బోర్‌వెల్ మోటార్‌ను ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో ఆలయ అవసరాలకు నీటి సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు,
ఈ కార్యక్రమంలోఐఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నీరటి శంకర్, గట్టేపల్లి గ్రామ సర్పంచ్ గుండేటి దేవేందర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మూల సత్యం, మత్స్య పారిశ్రామిక సంఘం గ్రామ అధ్యక్షుడు ఐలవేణి వీరస్వామి, ఈర్ల రమేష్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులుపాల్గొన్నారు.హనుమాన్ దేవాలయానికి బోర్‌వెల్ మోటార్ మంజూరు చేసిన గడ్డం వంశీకృష్ణ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సహకరించిన ఐఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నీరటి శంకర్‌కు ఆలయ కమిటీ సభ్యులు . ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పన కు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు..