కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇంచార్జ్
24-11-2026 | 07:52pm
- బి.ఎం. సందీప్‌కు ప్రభుత్వ విప్ విజయ రమణారావు
- హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి ఎమ్మెల్యే
మంథని, నవంబర్ 24(విజయ క్రాంతి) తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ(Telangana State Congress Party) వ్యవహారాల నూతన ఇంచార్జ్‌గా నియమితులైన బి.ఎం. సందీప్‌ను గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన బి.ఎం. సందీప్‌ను కలిసి అభినందించడం సంతోషంగా ఉందని విజయరమణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.