ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

05-10-2026 | 09:30pm

వెంకటాపూర్,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వేదవ్యాస ఉన్నత పాఠశాల(Vedavyasa High School) వైస్ హెచ్‌ఎం చింతిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి సూచించారు. సోమవారం పాఠశాల విద్యార్థిని ఆకుల భవిష్య జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా సూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఆక్సిజన్ ఎంతో అవసరమని, మొక్కల ప్రాధాన్యతను గుర్తించి వాటిని పెంచాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ(Environment)లో భాగంగా ప్రతి విద్యార్థి మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పసునూటి రాజయ్య, ఉపాధ్యాయులు హనుమంతు, అనూష, అక్షిత, భవాని, సుజాత, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు